భాయ్ కి భాషా లాంటి చరిత్ర - సాయికుమార్ గొంతుతో లాల్ సలామ్ ట్రైలర్

డీవీ

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (17:58 IST)
Lala salam trailer
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ తెలుగు ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన తారాగణంతో రూపొందగా రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్ నిర్మించింది. ఈనెల 9 న సినిమా విడుదల కాబోతుంది.
 
ట్రైలర్ లో ఏముందంటే..
ఊల్లో ఒక్క మగాడు లేడు.. శ్మశానం చేశాడు గదరా.. అనే వాయిస్ తోపాటు.. కత్తిపోట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత నీ కొడుకు మారి అమ్మోరు మెచ్చుకునేంత గొప్పోడు అవుతాడు. అని ఓ వ్యక్తికి మాట ఇవ్వడం. ఆ తర్వాత విష్ణు విశాల్ తో భార్య తాగుబోతు అంటూ గొడవపడడం. ఇలా పక్కా మాస్ కథతో సాగుతుంది. మరోవైపు ఊరిలో జాతర జరగబోతుంది. రెండు రోజులే జాతర కోసం కొడుకుల్ని తండ్రులు చూసే భాగ్యం కలుగుతుంది. ఇంకోవైపు ఆరు నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి.. అనగానే తెల్లటి డ్రెస్ తో స్టయిలిష్ గా భాయ్ (రజనీకాంత్) ఎంట్రీ.
 
భాయ్ చేసే పనులు.. కోర్టును ఖాతరు చేయడంలేదని అనిపిస్తుంది. వెంటనే.. నేను కోర్టును గౌరవించడంలేదు అనికాదు. అందులో వున్న కొంతమంది వ్యక్తులపై నమ్మకంలేదని భాయ్ అంటాడు. భాయ్ వాయిస్ సాయికుమార్ వాయిస్ కావడంతో అదోలా వుంది. మనో వాయిస్ కు అలవాటు పడిన తెలుగువారు కాబట్టి ఈాసారి రజనీకాంత్ తెలుగు వాయిస్ కొత్తగా అనిపిస్తుంది.
 
భాయ్ అంటే తెల్లఫైజమా వేసుకుని రోజుకు ఐదుసార్లు నవాజు చేస్తే సాధువు అనుకున్నావా? ముంబైలో భాయ్ భాషాలాంటివాడు.. అని వాయిస్ తో భాయ్ చరిత్ర చెప్పాడు. మతాన్ని మనసులో వుంచుకో. మంచితనాన్ని అందరితో పంచుకో. ఇండియన్ గా ఇది నేర్చుకో అనే భాయ్ డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఎ.ఆర్.రహమాన్ సంగీతం వెరయిటీ గా అనిపిస్తుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు