ఇందులో ఏముందంటే.. గార్గి తండ్రిని అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారో ఆమెకూ తెలీదు. అసలు నువ్వు ఏంచేస్తుంటావని ఓ పోలీసు అడుగుతాడు. టీచర్ అని చెబుతుంది. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి మీడియాకు తెలీయకముందే ఇల్లువిడిచి వెళ్ళిపోమంటారు పోలీసులు. ఆ తర్వాత తండ్రిని చూడ్డానికి వెళ్ళినా చూడనీయరు. ఓ లాయర్ వచ్చి గార్గి తండ్రి తరఫున వాదిస్తానంటాడు. ఇలా సాగుతున్న ట్రైలర్లో ఓ సామాజిక అంశాన్ని టచ్ చేసినట్లుగా ముగింపు ఇచ్చాడు దర్శకుడు. మరి రానా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడంటే పెద్ద విశేషం. రానా, సాయిపల్లవి విరాటపర్వం చేశారు. అందులో ఆమె నటనకు రానా ఫిదా అయిపోయాడు.