తులసీవనం సిరీస్ అందరికీ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ తరుణ్ భాస్కర్

డీవీ

శనివారం, 16 మార్చి 2024 (18:05 IST)
Tarun Bhaskar - Akshay - Aishwarya - Venkatesh Kakamanu - Anil Reddy
క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తులసీవనం'. ఈటీవ్ విన్ ఓటీటీ వేదికగా మార్చి 21 నుంచి ప్రసారం కానున్న నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ని చేసింది.
 
''జనరల్ గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా .. అవి ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి' అంటూ తులసి( అక్షయ్) డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.  ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్  ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్ గా నేచురల్ గా అలరించాయి. స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులుపంచాయి. అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామిక్ టైమింగ్ తో కడుపుబ్బానవ్వించారు. దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. స్మరన్ నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేయగా, ప్రేమ్ సాగర్ కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. స్టార్ ఎడిటర్ రవితేజ గిరిజాల ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. మొత్తానికి ట్రైలర్ తులసీవనం పై చాలా క్యురియాసిటీని పెంచింది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా వున్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ).  తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు వుంటాయి.  ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి వుంది.  క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ వుంటుంది. అనిల్ నిజాయితీ తీయడం ఒక ఎత్తైయితే దానికి ఈటీవీ విన్ ప్రోత్సహించడం మరో గొప్ప విషయం. ఇది వారితో నా మొదటి అసోషియేషన్. వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నపడు తెలుగులో కూడా టికెట్లు తెగుతున్నాయి. కథలు బాగా చెబుతున్నారనే బ్రాండ్ ఆ పరిశ్రమలకు క్రియేట్ అయ్యింది. తెలుగులో దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాలనేది నా కోరిక. ఇందులో ఈటీవీ విన్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాను. దీని కోసమే తులసీవనం తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.
 
డైరెక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. 'తులసీవనం' క్యూట్ రొమాంటిక్ కామెడీ. స్మరన్ అద్భుతమైన మ్యూజిక్ తో వేరే లెవల్ కి తీసుకెళ్ళారు. ఇది అందరూ రిలేట్ చేసుకునే కథ. ప్రేమ్ సాగర్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.  రవితేజ గిరిజాల చాలా బ్రిలియంట్ గా ఎడిట్ చేశారు. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నితిన్ సాయి ఈటీవీ టీంకి ధన్యవాదాలు. తరుణ్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. నేను తన దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఫ్యామిలీల చూసుకునేవారు. తన స్ఫూర్తితోనే దర్శకుడినయ్యాను. తులసీవనం తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
 
నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'తులసీవనం' అందరూ రిలేట్ చేసుకునే సిరిస్. తరుణ్ గారితో ఇది మా తొలి అసోషియేషన్ కావడం ఆనందంగా వుంది. టీం అందరికీ థాంక్స్. మార్చి 21న తప్పకుండా చూడండి. సపోర్ట్ చేయండి' అన్నారు.
 
అక్షయ్ మాట్లాడుతూ...తులసీ లాంటి ఫ్రెండ్  స్నేహితులందరిలో ఉంటాడు. అందరూ రిలేట్ చేసుకునే కంటెంట్ ఇది. అనిల్ గారు అద్భుతంగా తీశారు. ఇలాంటి పాత్ర ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. తరుణ్ గారు నాకు స్ఫూర్తి. ఈటీవీ విన్, యూనిట్ అందరికీ ధన్యవాదాలు. 21న తప్పకుండా తులసీ వనం చూడండి. మీ అందరినీ అలరిస్తుంది'' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు