వ‌ర్మ `డేంజ‌ర‌స్‌` ట్రైల‌ర్ లోనే అంతా చెప్పేశాడు

శుక్రవారం, 14 మే 2021 (20:21 IST)
Apsara Rani, naina
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో డేంజరస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. త్వరలో  మూవీ రిలీజ్  కాబోతుంది. నైనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ పాత్రలలో డేంజర్ క్రైమ్ మూవీ స్పార్క్ ఓటిటి లో రిలీజ్ కాబోతుంది, ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న నయనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ క్యారెక్టర్ర్స్ లో ఒదిగి పోయారు అని చెప్పాలి రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ చూపించిన విధానంలోనే తను ఏమి చెప్పతల్చుకున్నాడో క్లియర్ గా చూపించాడు.
ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అని మనక అర్ధమవుతుంది. నైనా, అప్స‌ర ఇద్ద‌రూ రొమాన్స్ చేసుకోవ‌డం చిత్రంలోని ప్ర‌ధాన అంశ‌మే అయినా ఇందులో యాక్ష‌న్‌, మ‌ర్డ‌ర్ స‌న్నివేశాలు కూడా వున్నాయి. అవి ఎందుకు? జ‌రిగాయి అనేది తెర‌పై చూడాల్సిందే. స‌హ‌జంగా వ‌ర్మ సినిమాలు మ‌ల్టీ ప్లెక్స్ ప్రేక్ష‌కుల‌కు అల‌రిస్తాయి. మ‌రి ఓటీటీలో ఈ సినిమాను కుటుంబంతో చూసేవిధంగా లేద‌నే చెప్పాలి. నిర్మాణం:స్పార్క్ ప్రొడక్షన్ హౌస్,  దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు