ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పుట్టిన రోజును ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో కొన్ని విశేషాలను గురించి తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
గౌతమ్ మీనన్ మూకాంబిగై కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, 1993 బ్యాచ్‌లో పట్టభద్రుడయ్యాడు. గౌతమ్ మీనన్ డెడ్ పోయెట్స్ సొసైటీ, నాయగన్ వంటి చిత్రాల నుండి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. కెరీర్ మార్గాన్ని మార్చుకోవాలని, చిత్రనిర్మాతగా మారాలని తన తల్లిదండ్రులకు తన కోరికను వ్యక్తం చేశాడు.
తన కళాశాల హాస్టల్‌లో తన మొదటి చిత్రాన్ని రాశాడు. ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ వద్ద శిష్యరికం తీసుకున్నారు. 1997లో మిన్సార కనవు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అందులో అతను అతిధి పాత్రలో కూడా కనిపించాడు. ధ్రువ నక్షత్రం - చాఫ్టర్ వన్ - యుద్ధ కాండం, బాలయ్య 109 వ సినిమా, హిట్లర్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
గౌతమ్ 25 ఫిబ్రవరి 1973న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపాలంలో జన్మించారు. అతని తండ్రి వాసుదేవ మీనన్ మలయాళీ, తల్లి ఉమ తమిళురాలు. కేరళలో జన్మించినప్పటికీ, అతను చెన్నైలోని అన్నానగర్‌లో పెరిగాడు.
పూర్తి పేరు- గౌతమ్ వాసుదేవ మేనన్
వృత్తి - దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, నటుడు
దర్శకత్వంలో గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రాలు- మిన్నలే (2001), కాక్క కాక్క (2003), వేట్టైయాడు విలయాడు (2006), వారణం ఆయిరాం (2008), విన్నైత్తాండి వరువాయ (2010), ఎన్నై అరిందాల్ (2015), వెందుతనిందదు కాడు (2022),