Trinadharao Nakkina, Indra Ram, Payal Radhakrishna
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.