న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ సినిమా ప్రమోషన్ లో భాగం వైజాగ్ వెళ్ళారు. అక్కడ యువత, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. నేను గతంలో ఓ అమ్మాయి ప్రేమ కోసం వైజాగ్ వచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా భార్య అయింది. అందుకే అల్లుడిగా మీ వైజాగ్ వస్తున్నాను. ఇప్పుడూ అలాంటి ప్రేమ వుంది. అందుకే అభిమానులను కలుసుకునేందుకు వచ్చాను. హిట్ 3 సినిమా లో నేను యాక్షన్ బాగా చేశాను.