తిరుమల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రతువును టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పర్యవేక్షించారు.
కాగా, శనివారం రాత్రి 9 గంటలకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇకపోతే ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.