తిరుమల బ్రహ్మోత్సవాలు 2013: చిన్న శేషవాహనంపై ఊరేగిన శేషాద్రి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శేషాద్రి చిన్న శేషవాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
సర్వాలంకార భూషితుడైన శ్రీవారు చిన్న శేషునిపై మలయప్ప స్వామి ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఇంకా ఏడు కొండలు భక్తుల గోవింద నామ స్మరణ మారుమ్రోగాయి. చిన్నశేష వాహనంపై స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలేనని తిరుమల ప్రధాన అర్చకులు అంటున్నారు.