చంద్రప్రభ వాహనంపై శ్రీవారు... విశిష్టత(వీడియో)

మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (21:32 IST)
ఏడవరోజు రాత్రి బ్రహ్మోత్సవంలో తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తున్నారు. చంద్రుడు చల్లదానానికి, మానోల్లాసానికి కారకుడు. వేంకటాద్రిపై కొలువున్న వేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు ఇరువురు రెండు నేత్రాలు. సూర్యుడు దివాకరుడు, చంద్రుడు నిశాకరుడు సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుక పగలు సూర్యప్రభ వాహనం జరిగిన తరువాత రాత్రి చంద్ర ప్రభవాహనం వైభవంగా జరిగింది.
 
చంద్రుడు అమృత కిరణాలు కలిగినవాడు, వేంకటేశ్వరుడు దేవతలకు అమృతం పంచి పెట్టిన మోహినీ అలంకారంలో అమృత కలశంతో చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. చంద్రుడు వల్ల సంతోషం కలుగుతుంది, చంద్రప్రభ వాహనంపై విహరిస్తున్న వేంకటేశ్వరుడిని దర్శన ద్వారా భక్తులకు మానసికోల్లాసం చేకూరుతుంది. 
 
తనను శరణు కోరిన వారి సుఖసంతోషాలకు తానే కారణమని చంద్రప్రభ వాహనం ద్వారా స్వామివారు భక్తులకు సందేశమిచ్చారు.శివుడికి చంద్రుడు శిరోభూషణమైతే శ్రీహరికి చంద్రప్రభ వాహనంగా భక్తుల ముందుకు రావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి