కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కల్వకుర్తి - నాగర్‌కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. 
	 
	వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఇలా కారులో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అధికారులు మండిపడుతున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, షాకింగ్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతలా వరద ఉధృతి వున్న వాగును ప్రస్తుతం దాటుకుని వెళ్లడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.