తన తండ్రి, బెంగుళూరు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందని ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. బుధవారం బెళగావిలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఆయనకు కావాలి. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారు కూడా. సతీష్ ఝర్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి. పెద్ద బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా ఉండండి అని యతీంద్ర వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ్ల యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, సిద్ధరామయ్య తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమారు రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సతీశ్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింతి. అయితే, ఈ పరిణామాలపై ఇటు కాంగ్రెస్ పార్టీ అటు సిద్ధరామయ్యగానీ స్పందించలేదు.