సోషల్ మీడియాలో షేర్ అయ్యే వీడియోలు కొన్ని కడుపుబ్బ నవ్వుతెప్పిస్తుంటాయి. మరికొన్ని సామాజిక సందేశాన్ని అందించేలా ఉంటాయి. అయితే, కొందరు యువకులు ఏదో చేయబోయి.. పరువు పోగొట్టుకుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ యువకుడు తనకు నచ్చిన ఓ యువతికి లవ్ ప్రపోజ్ చేస్తూ ఆమెకు రోజాపువ్వును అందించి, పైకి లేస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి అతను ధరించిన ఫ్యాంటు జారిపోతుంది. అంతే.. అక్కడున్న అమ్మాయిలంటా ఫక్కున నవ్వడంతో ఆ యువకుడి పరువు గంగలో కలిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఉన్న ఫుటేజీ ప్రకారం.. ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతికి లవ్ ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రతిపాదన కాస్త వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. చేతిలో ఓ రోజా పువ్వుతో స్నేహితులతో మాట్లాడుతున్న యువతి వద్దకు వెళ్లి చేయి తట్టి పిలుస్తాడు. ఆ వెంటనే మోకాళ్లపై నిల్చుని ఆమె చేతికి రోజా అందింది లవ్ ప్రపోజ్ చేసేశాడు.
ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. రోజా పువ్వు అందించిన తర్వాత పైకి లేచి నిలబడి ఆమె ముందు విభిన్నమైన ఫోజ్ పెట్టి ఏదో చెప్పాలని ప్రయత్నించేలోగా అతడి ఫ్యాంట్ కిందికి జారిపోతుంది. దీంతో అక్కడున్న యువతులంతా ఫక్కున పగలబడి నవ్వుతారు. ఫ్యాంట్ ఊడిపోవడంతో అవాక్కైన యువకుడు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయి పరువు దక్కించుకుంటాడు.
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "లవ్ ప్రపోజ్ చేయాలని వెళ్తే పరువు మొత్తం పోయిందిగా" అంటూ కొందరు, "వ్యూస్ కోసం భలే యాక్టింగ్ చేశారుగా" అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే వేలల్లో లైకులు, లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.