గోవాలో దారుణం జరిగింది. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు తాడేపల్లిగూడెం నుంచి 8 మంది స్నేహితుల బృందం వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ విషయంలో వీరంతా రెస్టారెంట్ వారితో ఘర్షణ పడ్డారు. దీనితో తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయిన రెస్టారెంట్ సిబ్బందిలో కొందరు పెద్దపెద్ద కర్రలు తీసుకుని దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకునేందుకు డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు ఈ 8 మంది యువతీయువకులు వెళ్లారు. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.