యజమాని మృతి.. 3నెలలైనా ఆస్పత్రి నుంచి కదలని శునకం.. చివరికి?

గురువారం, 16 మార్చి 2023 (09:57 IST)
Dog
యజమాని మృతి చెందినా... మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన తమిళనాడు ఆస్పత్రిలో చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఆస్పత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కానీ ఆ శునకం మాత్రం ఆయన అక్కడే వున్నారని భావించి ఆస్పత్రి నుంచి కదల్లేదు. 
 
యజమాని కోసం మూడు నెలలైనా.. ఆయన ఇకలేరనే విషయం గ్రహించకుండా యజమాని కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన చూపరులను కంట తడి పెట్టిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సేలంకు చెందిన మోహన్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మోహన్.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
అయితే యజమాని లోపలే వున్నారని భావించిన మృతుడి పెంపుడు శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఆస్పత్రి సిబ్బంది అక్కడ నుంచి పంపేసినా.. మళ్లీ అదే స్థలానికి చేరుకుంటోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే ఆ శునకానికి ఆహారం అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు