భర్తకు మెసేజ్‌లు పంపుతున్న మరదలిపై కేసు పెట్టిన భార్య.. ఎక్కడ?

మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:27 IST)
బావామరదళ్లన్న తరువాత ఒకరినొకరు ఆట పట్టించుకోవడం సహజం. అంతేకాదు మెసేజ్‌లు కూడా చేసుకుంటుంటారు. అదేమీ తప్పేమీ కాదు. అయితే తన భర్తకు చెల్లెలు మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడుతుందన్న కోపంతో ఒక అక్క ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు ఆరునెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన నేహతో వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి రెండు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగుతుండేది. అయితే నేహ చెల్లెలు స్వాతిక, శ్రీనివాస్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన్ను ఆట పట్టించడం ప్రారంభించింది. వాట్సాప్‌లలో ఇష్టమొచ్చినట్లు ఫోటోలు పెడుతూ, వల్గర్ వీడియోస్ పంపిస్తూ శ్రీనివాస్‌ను ఇబ్బందులకు గురిచేసేది.
 
దీంతో భర్త శ్రీనివాస్ తన భార్య నేహ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాడు. దీంతో బాధితురాలు మోతీనగర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మానసికంగా ఇబ్బందులుపడుతున్నాడని, స్వాతిక పంపిన మెసేజ్‌లు, ఫోటోలు, వల్గర్ వీడియోస్ మొత్తాన్ని పోలీసులకు అందించింది. పోలీసులు స్వాతికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు