ముస్లిం పర్సనల్ లా బోర్డు యుటర్న్ : అయోధ్య అంతిమతీర్పుపై రివ్యూ

ఆదివారం, 17 నవంబరు 2019 (17:04 IST)
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇటీవల అంతిమ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ముస్లీం పర్సనల్ లా బోర్డు యు టర్న్ తీసుకుంది. అయోధ్య అంతిమ తీర్పుపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆదివారం లక్నో వేదికగా ముస్లి పర్సనల్ లా బోర్డు సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూవివాదం తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చించేందుకు సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం తమ హక్కు అని తీర్మానించింది.
 
ఈ అంశంపై జమాయిత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని మాట్లాడుతూ, అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించలేదని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని, అయినప్పటికీ తమకు అక్కడ మసీదును ఇంతవరకు కేటాయించలేదన్నారు. 
 
అందుకే, వాస్తవంగా అక్కడ తమకు రావాల్సింది ఏమిటి అనేదానిపై స్పష్టత కోరుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. అటు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు