అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చోకీదార్ చోర్ వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలను తమకు కూడా ఆపాదించడం దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని ధర్మాసనం స్పష్టంచ చేసింది.
పైగా, ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చెప్పిన క్షమాపణలను అంగీకరించిన సుప్రీంకోర్టు మరోమారు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ మందలించి వదిలివేసింది. అలాగే, భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ హితవు పలికింది.
అదేవిధంగా, 36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబరు 14వ తేదీన సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పును పునఃపరిశీలించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో పాటు.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటినీ విచారించిన కోర్టు రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో విచారణార్హమైన అంశాలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.