ఆగస్టు నెలలో బ్యాంకులు చాలావరకు మూసివేయబడుతాయి. అటువంటి పరిస్థితులలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే ముందు సెలవుల వివరాలను తెలుసుకోవడం మంచిది. మనకందరికి తెలిసిన విషయం బ్యాంకు రెండు, నాల్గవ శనివారాలు ఉండవని మాత్రమే. ఆగస్టు 1న మొదటి శనివారం, దీని ప్రకారం బ్యాంకు తెరిచి ఉండాలి కాని బక్రిద్ కాబట్టి సెలవు. ఆగస్టు 2 ఆదివారం, ఆగస్టు 3 రక్షాబంధన్, ఆగస్టు మొదటి వారం 3 నుండి 9వరకు బ్యాంకు ఉంటుంది.
ఆగస్టు8 రెండవ శనివారం, 9 ఆదివారం కాబట్టి సెలవులు. ఇక ఆగస్టు 10 నుండి 16 వరకు చూద్దాం. ఆగస్టు 11, 12 కృష్ణాష్టమి, 13 దేశభక్తుల దినోత్సవం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16 ఆదివారం, ఆగస్టు 20, 21 సెలవులు, 22 గణేష్ చతుర్థి, 23 ఆదివారం, ఆగస్టు 29 మొహర్రం, 30 ఆదివారం, ఆగస్టు 31 ఓనం కాబట్టి సెలవు ఉంటుంది. కనుక బ్యాంకులతో లావాదేవీలు చేసేవారు ముందుగానే అన్నీ చేసుకోవడం మంచిది.