ఆగస్టు తర్వాతే మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్: మంత్రి రమేష్

ఆదివారం, 7 జూన్ 2020 (17:26 IST)
ఆగస్టు తర్వాతే మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు తర్వాతే రీ-ఓపెన్ చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. 
 
జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు జరిగిన పరీక్షలతోపాటు ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలను ఆగస్టు 15లోగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
 
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 5వ దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 5లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు, కాలేజీలను 30 శాతం అటెండెన్స్‌తో జులైలో రీఓపెన్ చేస్తారని, 8వ తరగతిలోపు స్టూడెంట్స్ ఇళ్ల దగ్గరే ఉంటారని భావించారు. 
 
అలాగే గ్రీన్, ఆరెంజ్ జోన్స్‌లోనూ విద్యా సంస్థలు మళ్లీ తెరుస్తారని.. భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ అటెండెన్స్‌తో రెండు షిఫ్ట్స్ మధ్య క్లాసుల నిర్వహణ ఉంటుందని అనుకున్నారు. కానీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పట్లో స్కూళ్లు, పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు