వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని బెలగావి జిల్లాకు చేరుకున్న తర్వాత, అప్లికేషన్ వారికి ఒక చిన్న మార్గాన్ని చూపించింది. అది ఖాన్‌పూర్‌లోని దట్టమైన భీమ్‌ఘర్ అడవి గుండా వెళుతుంది. 8 కిలోమీటర్లు లోపలికి వెళ్లాక వారికి అది పొరపాటు అని అర్థమైంది. ఆ క్రమంలో కారు దట్టమైన అడవికి చేరుకున్నాక ఫోన్ నెట్ వర్క్ కూడా తగ్గిపోయింది. దీంతో వారు చేసేదేమి లేక రాత్రంతా అడవిలో గడిపారు.
ఈ అడవి ప్రమాదకరమైన వన్యప్రాణులను కలిగివుందని పోలీసులు తెలిపారు. గత నెలలో కూడా గూగుల్ మ్యాప్స్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇక తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి.