అయితే, శనివారం రాత్రి అత్యంత విషమంగా మారిన ఆమె ఆరోగ్యం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమెకు వయసు 92 యేళ్లు. గత 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరి, కోలుకున్న విషయం తెల్సిందే.
2001లో భారత అతున్నత పౌర పురస్కారమైన "భారతరత్న"ను అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా లతా మంగేష్కర్‌కు ఇచ్చారు. అలాగే, 1989లో "దాదా సాహెహ్ ఫాల్కే" అవార్డును కూడా అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే "లీజియన్ ఆఫ్ హానర్" పురస్కారం కూడా పొందారు.