ఇటీవలే స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరుసాగిస్తామని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ) వర్గాల ప్రతినిధులు ప్రకటించారు.
సెక్షన్ 377 భవితవ్యాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసిన కేంద్రం... స్వలింగ వివాహానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్వలింగ మేజర్లు పరస్పర అంగీకార శృంగారంలో పాల్గొనడం నేరం కాదంటే ఒప్పుకుంటాం. కానీ స్వలింగ వివాహాల చట్టబద్ధానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించబోదు అని కేంద్రంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.