తిరుపతిలో కరోనా టీకా వేసిన పారిశుద్ధ్య కార్మికుడు మృతి, అతడికి అవి వున్నాయట

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:36 IST)
తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన 49 ఏళ్ల కృష్ణయ్య అనే పారిశుద్ధ్య కార్మికుడు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత మరణించాడు. మంగళవారం నాడు 11 గంటలకు అతడికి టీకా ఇచ్చారు. అర్థగంట పాటు అక్కడే వున్నాడు. అతడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో ఇంటికి వెళ్లాడు. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున అతడు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
కాగా మృతుడికి రక్తపోటు, మధుమేహం సమస్యలు వున్నాయని అతడి కుమారుడు వెల్లడించాడు. తన తండ్రికి టీకా వద్దని చెప్పామనీ, బీపీ, షుగ్ వుందని చెప్పినా వేసారంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. ఐతే కృష్ణయ్య చనిపోవడానికి కారణం టీకానా లేదా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అప్పటివరకూ అతడు టీకా కారణంగా మృతి చెందాడని చెప్పలేమని వైద్య అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు