అయోధ్యలో అద్భుతం జరిగిందా? ప్రాణప్రతిష్ఠ తర్వాత తన రూపాన్ని మార్చుకున్న అయోధ్య రాముడు

ఐవీఆర్

గురువారం, 25 జనవరి 2024 (13:17 IST)
కర్టెసి-ట్విట్టర్
అయోధ్యలో అద్భుతం జరిగిందా? అంటే అవుననే అంటున్నారు స్వయంగా రాములవారి విగ్రహాన్ని మలిచిన అరుణ్ యోగిరాజ్. తను మలిచిన రాములవారి విగ్రహానికి అయోధ్య గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత రాముల వారి రూపానికి తేడా వున్నట్లు గమనించానన్నారు. వాస్తవానికి విగ్రహంలో తను ఎలాంటి మార్పులు చేయలేదనీ, ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముల వారి రూపంలో వున్న తేడా ఎందుకు వచ్చిందన్నది తనకి కూడా తెలియలేదంటున్నారు. బహుశా అదంతా రాములవారి మహిమ అయి వుంటుందన్న చర్చ మొదలైంది.
 
శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ మలిచిన విగ్రహ రూపం తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నారు. ఆ శిల్పానికి ప్రస్తుతం అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన శిల్పానికి.. ప్రధానంగా ముఖకవళికలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కనుబొమలు, చెక్కిళ్లు, కంటిపాపలు, పెదవులు, ముక్కు ఇలా అన్నింటిలోనూ స్పష్టమైన మార్పులు గోచరిస్తున్నాయి. నిజంగా రాములవారే అక్కడ నిల్చుని వున్నారా అనే అనుభూతి కలుగుతోంది.
 
అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ... "దేవుడు లోపలికి వెళ్ళిన వెంటనే మారిపోయాడు. ప్రాణ్ ప్రతిష్ట తరువాత, రాంలల్లా మారిపోయినట్లు నేను చూశాను, ఇది నా పని కాదని నేను చెప్పాను." అని అన్నారు.
 

The expressions on face and eyes of Ram Lalla changed as soon as Pran Pratishtha happened.

- Sculptor Arun Yogiraj pic.twitter.com/u2L5TH7NXD

— Rishi Bagree (@rishibagree) January 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు