70 ఏళ్లు నిండాక కూడా చిత్ర నిర్మాణ బాధ్యతలను నెత్తి మీద వేసుకుని, కథా చర్చలు వగైరాలు చేయడం కాస్త కష్టమని అనుకున్నారో ఏమోగానీ ఆస్తినంతా ముగ్గురు కొడుకులకి పంచేసి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారట. అందువల్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ పెద్ద కుమారుడు వెంకటేష్‌కి, మిగిలిన ఆస్తులను కూడా అల్లు అర్జున్, అల్లు శిరీష్ కి పంచేయాలని డిసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా అల్లు వెంకటేష్ గీతా ఆర్ట్స్ బ్యానర్ క్రింద వరుణ్ తేజ్ హీరోగా చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రంలో నిర్మాతగా అల్లు అరవింద్ కి బదులు అల్లు వెంకటేష్ అనే పేరు పడబోతోంది. ఇక బన్నీ కూడా ఈమధ్యనే కొత్త ఇల్లు నిర్మాణానాకి శంకుస్థాపన చేశారు. చెర్రీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి విజయవంతంగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా అదే ప్లానుతో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.