ఫన్నీ వైరల్ వీడియో: పెళ్లి ఫోటో షూట్‌లో అలా పడిపోయారు..

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:26 IST)
సోషల్ మీడియా పుణ్యంతో ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి ఫోటో షూట్‌ సమయంలో వధూవరులు వేదికపై పడిపోయారు. ఈ వీడియోకు భారీగా లైకులు వెల్లువెత్తుతున్నాయి. 
 
వీడియోలో పెళ్లి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఒక వధువు వేదికపై పడిపోయింది. వధువు బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయినా వరుడు చాకచక్యంగా ఆమెపై పడిపోకుండా ఆమెను దాటుకున్నాడు. ఈ వీడియో షేర్ చేయబడిన గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్‌లు రాబట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు