ఆవిడ వేరు... గ‌ర్ల్ ఫ్రెండ్ వేరు- సెక్ష‌న్ 498ఎ కుద‌ర‌దన్న హైకోర్టు

సోమవారం, 26 జులై 2021 (22:35 IST)
గర్ల్ ఫ్రెండ్‌ను సెక్షన్ 498 ఏ కింద విచారించడానికి వీల్లేదు అని ఏప‌నీ హైకోర్టు తేల్చి చెప్పింది. గర్ల్ ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498 ఏ ( మహిళను వేధింపులకు గురిచేయడం ) కింద విచారించడానికి వీల్లేదని అని తేల్చింది.

ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ ఫ్రెండ్ పైన పోలీసులు 498 ఏ కింద నమోదు చేసిన కేసులో... ఆమె అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. భర్త బంధువుల్లో గర్ల్‌ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498 ఏ కింద విచారించడానికి వీల్లేదని తెలిపింది.
 
నెల్లూరు జిల్లా దిశ పోలీసు స్టేషన్లో ఓ వివాహత .. తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉన్న మహిళపై ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ పేర్కొంది. ఫిర్యాదు చేసిన వివాహిత ... భర్తను మొదటి నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు. దీంతో దిశ పోలీసులు .. ఐపీసీ సెక్షన్ 498ఏతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే తనపై సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితురాలు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ .. తనపై నమోదైన ఎస్ఎఆర్‌ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ... ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు పిటిషనర్ బంధువు కాదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ పోలీసులు సెక్షన్ 498 ఏ కింద నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వివ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు