తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం-ట్రెండింగ్ అవుతున్న ఫోటో

శనివారం, 4 జూన్ 2022 (14:22 IST)
photo courtesy_Social media
తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. ఎండ, వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, గోకవరం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వివరించింది. మరో 186 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. 
 
అలాగే ఖమ్మం కొత్తగూడెం 46 డిగ్రీలు, కరీంనగర్‌ ఆదిలాబాద్‌, మంచిర్యాలలో 44 డిగ్రీలు, నల్గొండ, వరంగల్‌ , నిజామాబాద్‌లో 43 డిగ్రీలు, హైదరాబాద్‌, సిద్ధపేట, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
 
ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా నీటిని తాగుతుండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగవచ్చని వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు