గెలుపు ఓటముల కోసం తను రాజకీయాల్లోకి రాలేదనీ, ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని అన్నారు. చిరంజీవీ... ఇకపై నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ ఘాటుగా సూచన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణిపై అవగాహన పెరిగిందంటూ కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా రాజకీయాలు ధన, కుల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయనీ, ఎంతటి స్టార్లయినా రాజకీయాల్లో నిలబడం కష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దీనికి నిదర్శనమే తను, తన తమ్ముడు పవన్ కల్యాణ్ అని చెప్పారు. మంచి చేద్దామని ప్రజల్లోకి వెళ్లినా ఇతర రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పుకొచ్చారు. అందుకే... కమల్-రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండా వుంటే మంచిదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.