గ్రేట్ బ్రిటన్‌ను దాటేసిన భారత్, ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఇండియా

శనివారం, 3 సెప్టెంబరు 2022 (14:34 IST)
భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది. బ్లూమ్‌బెర్గ్ తాజా లెక్కల ప్రకారం 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించిన తర్వాత భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్లూమ్‌బెర్గ్ ఐఎంఎఫ్ డేటాబేస్, చారిత్రాత్మక మారకపు ధరల ఆధారంగా భారతదేశం స్థానాన్ని నిర్ణయించారు.

 
భారతీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $854.7 బిలియన్లుగా వుండగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $ 816 బిలియన్లుగా వున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశం- యూకే మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

 
2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి "అభివృద్ధి చెందిన" దేశంగా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త రావడం హర్షణీయం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక దేశాన్ని... ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఇంగ్లండును దాటడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు