భారత సైన్యానికి చిక్కిన "యతి" పాదముద్రలు... ఒంటికాలిపై తపస్సా?

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (08:58 IST)
యతి. ఈ పేరు చెప్పగానే చాలామందికి హనుమంతుడే చటుక్కున గుర్తుకు వస్తాడు. ఆంజనేయుడు చిరంజీవి(మరణంలేదు) కావున ఈ కలియుగంలోనూ మానవులకు దుర్భేధ్యమైన ప్రాంతంలో ఆయన నివాసముంటారని ఎప్పటినుంచో గాధలు వున్నాయి. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో ఆయన కొలువై వున్నాడని చెప్పుకుంటూ వుంటారు.
 
మరి ఈ గాధలు నిజమో కాదో తెలియదు కానీ భారత సైన్యానికి హిమాలయ ప్రాంతంలో యతి పాదముద్రలు చిక్కాయి. తమ ట్విట్టర్ ఖాతాలో ఆర్మీ ఈ విషయాన్ని పేర్కొంది. వారు విడుదల చేసిన ఫోటోల్లో మంచుపై మచ్చలతో వున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
 
భారతీయ సైన్యంలో సాహసయాత్ర జట్టు ఏప్రిల్ 9, 2019న చేపట్టింది. ఇందులో భాగంగా వారు ఈ పాదముద్రలను కనుగొన్నారు. ఈ పాదముద్రల పరిమాణం సుమారుగా 32x15 అంగుళాల మేర వున్నట్లు తెలిపారు. ఇవి మకాలు-బరున్ జాతీయ పార్కుకి సమీపంలో కనిపించాయి.
 
దాని గురించి 4 ప్రత్యేక విషయాలు...
 
- ప్రపంచంలో అత్యంత రహస్యమైన జీవులకు యతిని పేర్కొంటున్నారు. కొంతమంది పరిశోధకుల వాదన ప్రకారం 40 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతుల, ధ్రువ ఎలుగుబంటి. కొంతమంది పరిశోధకుల ప్రకారం, హిమాలయాలలో ఈ జాతి వున్నట్లు చెప్తారు.
 
- మరికొందరి శాస్త్రవేత్తలు యతి అనేది వానర జాతికి చెందినదనీ, మానవుడి వలె రెండు కాళ్లతో అతిభారీ ఆకారంతో వుంటాయని చెప్పారు.
 
- నేపాల్, లడఖ్ మరియు టిబెట్ హిమాలయ ప్రాంతంలో మహిమాన్వితమైన యతి నివాసం వున్నారని పురాణాలలో చెప్పబడింది.
 
- అలాగే అత్యంత శీతల వాతావరణంలో నివాసం వుండగల సామర్థ్యం యతికి వుంటుందనీ, పైగా శరీరం అంతటా రోమాలతో అచ్చు హనుమంతుని పోలి వుంటుందనే వాదనలు కూడా వున్నాయి. 
 
మరి ఇప్పుడు గోచరమైన ఆనవాళ్లు హనుమంతుడివా... లేదంటే కొందరు వాదిస్తున్నట్లు అంతా భ్రమా అనేది తెలియాల్సి వుంది. మరోవైపు ఆర్మీ షేర్ చేసిన పిక్చర్స్ పైన ట్వీట్లు ప్రారంభమయ్యాయి. ఈ పాదముద్రికల్లో ఒంటికాలిది మాత్రమే వుండటంతో యతి ఒంటికాలిపై తపస్సు చేస్తున్నాడనీ, ప్రపంచంలో పాపం శఖరాగ్ర స్థాయికి చేరడంతో ఆయన కఠోరదీక్ష చేస్తున్నాడనీ పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు