ఇప్పటి వరకు మహిళలు ఆర్మీలో మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే పని చేస్తున్నారు. కాగా మహిళలకు కూడా క్షేత్రస్థాయిలో జవాన్లుగా పని చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను అటు భారత సైన్యం, ఇటు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నాయి.
దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ నగరాల్లో వీటికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహిస్తారు. అందులో ప్రముఖంగా అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూరు, షిల్లాంగ్ పట్టణాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా రాతపరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.