దీర్ఘాయుష్మాన్ భవ, నిండు 300 ఏళ్లు జీవించు నాయనా? అదెలా సాధ్యం?

ఐవీఆర్

బుధవారం, 10 జనవరి 2024 (11:30 IST)
ఇదివరకు దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు భార్యాపిల్లలతో జీవించు నాయనా అని దీవించేవారు. ఐతే రానున్న కాలంలో నిండు 300 ఏళ్లు జీవించు నాయనా అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్. అలా ఎలా జరుగుతుందన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో పరిశోధనలు ప్రత్యేకించి మనిషి ఆరోగ్యం, ఆయుర్దాయంపై జరుగుతున్నాయని చెప్పారు. 
 
ఈ వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవిత కాలం పెరిగే అవకాశం వుందంటున్నారు. మనిషి రోగగ్రస్తుడైనపుడు అతడి అవయవాలు పాడైనప్పటికీ, చనిపోయే దశలో వున్న జీవకణాలను సైతం తిరిగి ఆరోగ్యవంతమైన కణాలుగా మార్చడం ద్వారా మనిషి ఆయుర్దాయం పెంచే అవకాశంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఇది ఫలవంతమైతే మనిషి ఇప్పటి ఆయుర్దాయం 70 ఏళ్ల కన్నా కనీసం 200 నుంచి 300 ఏళ్ల వరకూ జీవించే అవకాశం వుంటుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు