శ్రీరెడ్డి వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడూ వివాదాలంటే ఎదురెళ్ళి నిలబడే రామ్ గోపాల్ వర్మ.. కాస్టింగ్ కౌచ్‌లో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు పలికాడు. ఆమెను ఝాన్సీ లక్ష్మీభాయ్ అంటూ కొనియాడాడు. అయితే శ్రీరెడ్డి ఎపిసోడ్‌తో రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కుమారుడు అభిరాం, శ్రీరెడ్డి వివాదంలో సెటిల్‌మెంట్ కోసం ప్రయత్నించాడట.
అభిరాం వ్యవహారంలో సెటిల్‌మెంట్ చేసుకోవాలని శ్రీరెడ్డికి సూచించిన రాంగోపాల్ వర్మ దగ్గుబాటి సురేష్‌బాబు నుంచి రూ.5కోట్ల రూపాయలు ఇప్పిస్తానని భారీ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆ ఆఫర్‌ను శ్రీరెడ్డి తిరస్కరించిందని.. ఓ చిన్న ఆర్టిస్ట్ అంత పెద్ద మొత్తాన్ని తిరస్కరించడం షాక్‌ను మిగిల్చిందని వర్మ చెప్పాడు. అంతేగాకుండా వర్మ తనంతట తానుగానే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయాలేమీ దగ్గుబాటు సురేష్‌బాబుకి తెలియవన్నాడు.
అయితే క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని వర్మ చెప్పుకొచ్చాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే వర్మ సలహా ఇచ్చానని చెప్పాడు. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనన్నాడు. కేసీఆర్, పవన్ కల్యాణ్ కూడా పలుమార్లు విమర్శించుకున్నారని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారని గుర్తుచేశాడు. రాజకీయ నేతలు చేసే పనినే తాను చేశానంటూ చెప్పుకొచ్చాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా మహేశ్ కత్తి పాపులర్ అయ్యాడని శ్రీరెడ్డికి చెప్పానని వర్మ అన్నాడు.
అయితే మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు బన్నీ వాసు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ''నీ సంగతేంటో తేలుస్తాం యుద్ధానికి రెడీగా ఉండు'' అంటూ అల్టిమేటం ఇచ్చాడు. మెగా అభిమానుల సత్తా ఏంటో వర్మకు రుచి చూపిస్తామన్నాడు. మెగా ఫ్యామిలీ మద్దతుదారులంతా గురువారం సమావేశమవుతున్నట్లు తెలిపిన బన్నీవాసు తమ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామని చెప్పాడు. ఇక శ్రీరెడ్డి వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకోవడం వెనుక పబ్లిసిటీ పైత్యమేనని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మరోవైపు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత ఆదివారం తాను న్యూస్ ఛానెల్ చూస్తున్న సమయంలో శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా దూషించిందన్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్ అయిన తనను ఆ విషయం తీవ్రంగా కలిచివేసిందంటూ.. శివబాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఉద్దేశ్యంతోటే శ్రీరెడ్డి అలా మాట్లాడిదంటూ శివబాలాజీ తన ఫిర్యాదులో ఆరోపించారు.