దైవ దర్శనానికి వెళ్లిన తనపై శ్యామల దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు శ్యామలతో పాటు మరో 15 మందిపైన సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. సికింద్రాబాద్ లోని గాంధీ నగర్లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి సంధ్య ఈ నెల 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శించుకునేందుకు వెళ్లారు.
దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న వారిని జోగిని శ్యామల కలిశారు. శ్యామల తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ స్రవంతి తన తల్లి సంధ్యను కోరింది. దాంతో వారు జోగిని నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ 15 మంది పురుషులు మరో మహిళ ఉండటంతో స్రవంతి ఇంట్లోకి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. అయినా జోగిని శ్యామల వినిపించుకోకుండా లోపలి రావాలంటూ అభ్యర్థించడంతో స్రవంతి తన తల్లి లోనికి వెళ్లారు.