గుండుతో కనిపించిన ధోనీ, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? (video)

ఆదివారం, 14 మార్చి 2021 (20:47 IST)
మహేంద్ర సింగ్ ధోని 2005లో పాకిస్థాన్‌పై తన మొదటి సెంచరీతో ప్రసిద్ధి చెందాడు. ఆ సెంచరీతో పాటు అతని పొడవైన జుట్టు కూడా బాగా ప్రసిద్ది చెందింది. ఆ కాలంలోనే, పొడవాటి జుట్టు ఫ్యాషన్‌గా మారిపోయింది. చాలామంది ధోనీలా జుట్టు పెంచుకుని కనబడ్డారు. ఆ తర్వాత మెల్లగా జుట్టు కత్తిరించేసి సాధారణ స్టయిల్‌కు వచ్చాడు.
 
ఐతే తాజాగా ధోనీ గుండుతో కనబడి షాకిచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే మాంక్ అవతారంలో కనబడి ఆశ్చర్యపరిచాడు. ఈ ఫోటోను ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసింది. ఇక అప్పట్నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. త్వరలో ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ ఇలా గుండుతో కనిపిస్తారేమోనని కామెంట్లు చేస్తున్నారు.
 
ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్స్‌లో మహేంద్ర సింగ్ ధోని రనౌట్ అయినప్పటి నుండి, అతను క్రికెట్ కంటే ఎక్కువ కారణాల వల్ల వార్తల్లో నిలిచాడు. ప్రపంచ కప్ తరువాత, అతను భారత సైన్యంలో చేరాడు. కాశ్మీర్లో పనిచేశాడు. గత ఏడాది ఆగస్టు 15న పదవీ విరమణ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇటీవల, ధోని వ్యవసాయంలో కూడా విజయం సాధించాడు. కడక్‌నాథ్ కోళ్లను పెంచాడు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతూ కన్పించాడు.
 

After Paying Back All The Amrapali Money...https://t.co/SnY1hFAyTc pic.twitter.com/aW7UPGauyk

— Babu Bhaiya (@Shahrcasm) March 13, 2021
ఐపీఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోని 14 మ్యాచ్‌ల్లో కేవలం 200 పరుగులు చేయగలిగాడు. అతను మొత్తం 16 ఫోర్లు మరియు 7 సిక్సర్లు కొట్టాడు. మరి వచ్చే ఐపీఎల్ క్రీడల్లో బ్యాటుతో బంతిని ఆడుకునేందుకు ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడేమోనని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు