కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ మార్పిడి ఖర్చును పూర్తిగా భరించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. లింగ మార్పిడి అయ్యే రూ.2 లక్షల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
కేరళ సర్కారు ట్రాన్స్ జెండర్ల కోసం విద్యాహక్కు, ఉద్యోగావకాశాలను 2015లోనే కల్పించింది. తాజాగా లింగమార్పిడి సర్జరీ చేయించుకుని పౌరసమాజంలో తలెత్తుకుని జీవించే వెసులుబాటు కల్పించింది. దీనిపై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.