సబ్ రిజస్టర్ కార్యాలయంలో నాగుపాము, ముంగీసు కొట్లాటను చూసిన జనాలు జడుసుకుని పరుగులు తీశారు. కేరళ, ఆళప్పుయా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆళప్పుయా ప్రాంతంలో 100 ఏళ్ల పాత భవనంలో రిజిస్టర్ ఆఫీసు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్టర్ ఆఫీసులో ఓ ఉద్యోగి ఫైల్ కోసం ఓ గదిని తెరిచాడు.
అంతే ఆ ఉద్యోగి షాకై.. పరుగులు తీశాడు. ఆ గదిలో పాము- ముంగీసు ఆవేశంగా కొట్లాడుకుంటుండగా చూసిన ఆ ఉద్యోగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. ఈ ఉద్యోగితో పాటు ఆ భవనంలోని మిగిలిన ఉద్యోగులు సైతం పామును ముంగీసును చూసి పారిపోయారు. దీంతో సమాచారం అందుకుని రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు పామును, ముంగీసును పట్టుకెళ్లారు.