ప్రియతమ నేత ప్రశాంతంగా సాగునంపుదాం.. స్టాలిన్ పిలుపు

మంగళవారం, 7 ఆగస్టు 2018 (21:54 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
ద్రవిడ సూర్యుడు ఇకలేరు. మన ప్రియతమ నేతను ప్రశాంతంగా సాగనంపుదాం.. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి భావోద్వోగాలకు గురికావద్దని కోరారు.
 
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూయడంతో స్టాలిన్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత విచారంలోనూ ఆయన మీడియా ముందుకు వచ్చి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, మన ప్రియతమ నేత పట్ల గౌరవం చాటుకునే సమయమిదని సూచించారు.
 
ఇదిలావుంటే, కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు