ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ భయపెడుతోంది. అనేక ప్రపంచ దేశాల్లో భారీ సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ బాలికకు ఈ వైరస్ సోకింది. అయితే, ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ ఎక్కువగా సెక్స్ కారణంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలిపింది.
అలాగే, మాట్లాడేటపుడు వెలువడే తుంపర్లు ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందువల్ల మంకీపాక్స్ వైకర్స సోకినవారు ఇతరులకు దూరంగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ కోరారు.
ఇదిలావుంటే, ఇప్పటివరకు 29 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. గతంలో మంకీపాక్స్ లేని దేశాల్లోనూ ఇపుడు కేసులు వెలుగు చూడటం గమనార్హం. ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఇప్పటివరకు 66 మంది చనిపోయారని టెడ్రోస్ వెల్లడించారు.