గంటన్నర వ్యవధిలోనే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం : ఈవో ధర్మారెడ్డి

గురువారం, 9 జూన్ 2022 (09:32 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే సర్వదర్శన భక్తులకు కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించినట్టు చెప్పారు. 
 
ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ, సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. అదేసమయంలో శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని చెప్పారు. 
 
తిరుమల కొండవై దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ.215 కోట్లు శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా స్వామివారికి చేరుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్ళలో రూ.1500 కోట్ల విరాళాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. 
 
తిరుమలలో 7500 గదులకు 40 యేళ్లుగా మరమ్మతులు చేయలేదని, కానీ కరోనా కాలంలో 4500 గదులకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబరు నాటికి మిగిలిన గదులకు కూడా మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు