మొదటి ఫోటో ఎన్డీయే నాయకులతో కలిసి దిగిన గ్రూప్ ఫోటో, రెండవది కుటుంబ ఫోటో, మూడవది ఆయన ప్రజలకు సేవ చేస్తున్న ఫోటోలు కనిపించాయి. కాస్త చురుగ్గా ఉండే మంత్రి నారా లోకేష్ కూడా తన తండ్రి కంటే కాస్త ముందుగా గిబ్లి ట్రెండ్స్‌లోకి అడుగుపెట్టారు. లోకేష్ తన గిబ్లి ట్రెండ్‌ను ప్రారంభించడానికి మూడు చిత్రాలను కూడా పోస్ట్ చేశారు.
మొదటి ఫోటో నారా లోకేష్ సతీమణి భార్య, కుమారుడితో ఉన్న కుటుంబ ఫోటో, రెండవ, మూడవ ఫోటోలు టిడిపి మద్దతుదారులతో ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఒకే రోజు, నిమిషాల వ్యవధిలో గిబ్లి ట్రెండ్స్‌లోకి ప్రవేశించడం టీడీపీ అనుచరులను సంతోషపరిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌లతో కలిసి చంద్రబాబు దిగిన తొలి గిబ్లి ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. చాలా మంది దృష్టిని ఆకర్షించింది.