ప్రకాష్‌ రాజ్‌తో సెల్ఫీ.. భార్య ఆ పని చేసినందుకు కేకలేసిన భర్త... ఆ తర్వాత?

శనివారం, 15 జూన్ 2019 (20:23 IST)
సాధారణంగా ఎవరైనా ప్రముఖులు కనిపిస్తే ఫోటోలు తీసుకుంటుంటాం. మనకు బాగా నచ్చిన సినీ ప్రముఖులైతే సెల్ఫీలు తీసుకుని వాట్సాప్, ఫేస్ బుక్‌లలో షేర్ చేస్తుంటాం. అది మామూలే. కానీ ఒక మహిళ విషయంలో ఒక్క సెల్ఫీ ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. అది కూడా నటుడు ప్రకాష్‌ రాజ్‌తో ఫోటో తీసుకోవడంతో.
 
కాశ్మీర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో నటుడు ప్రకాష్‌ రాజ్ పాల్గొంటున్నాడు. షూటింగ్ పూర్తయి హోటల్‌కు వెళుతున్న ప్రకాష్‌ రాజ్‌ను ఒక మహిళ, ఆమె కుమార్తె చూశారు. ప్రకాష్‌ రాజ్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ఆ మహిళ తన కుమార్తెను తీసుకుని దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకుంది. సెల్ఫీ తీసుకుని ముందుకు వెళుతుండగా ఆమె భర్త కనిపించాడు.
 
సెల్ఫీ ఎందుకు తీసుకున్నావంటూ గట్టిగా అరిచాడు. ఫోటోను వెంటనే డిలీట్ చేయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న ప్రకాష్‌ రాజ్ ఆ వ్యక్తిని పక్కకు పిలిచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడిగాడు. ప్రధాని మోడీని మీరు తిడుతున్నారు. దేశానికి మోడీ ఎంతో చేస్తున్నారు. అందుకే మీరంటే నాకు ఇష్టం లేదు.
 
నా భార్య మీతో ఫోటో తీసుకోవడం కూడా ఇష్టం లేదని చెప్పాడట. దీంతో ప్రకాష్‌ రాజ్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. భార్య, పాపను కూడా పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు