మోదీకి వంగివంగి పాదాభివందనం చేయబోయిన సీఎం జగన్... ప్రధాని ఏం చేశారంటే?

సోమవారం, 10 జూన్ 2019 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు తిరుమల తిరుపతి దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ప్రధాని విమానం నుంచి కిందికి దిగగానే గులాబీల బొకేతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత ఆయనకు వంగి వంగి పాదాభివందనం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇది గమనించిన ప్రధాని వద్దని వారిస్తూ ఆయన భుజం తట్టారు. ఐతే సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అలాగే చేయబోగా మళ్లీ ప్రధానమంత్రి వారించారు. 
 
ఏదేమైనా పెద్దవారు వచ్చినప్పుడు ఇలా నమస్కారం చేయడం చిన్నవాళ్లకు మామూలే కదా. ఇది మన తెలుగు సంప్రదాయం కూడాను. పెద్దలను గౌరవించవలెను అన్నది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పే మాట కనుక సీఎం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి నమస్కారం చేయబోయారు. పీఎం వద్దనడంతో వెనక్కి తగ్గారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు