ఈ వీడియోలో అనేక కేబుల్ లైన్లు, విద్యుత్ స్తంభాలతో కూడిన రహదారిని చూడవచ్చు. భూమి నుంచి ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కరెంట్ తీగపై నిలబడి ఉన్న మేకను జూమ్ చేస్తుంది. కేబుల్ వైర్‌కు తగులుకున్న గడ్డి తినడానికి ఆ మేక ముందుకు వంగి కనిపిస్తుంది.
ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. కానీ ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు. కరెంట్ తీగపై ఆ మేక ఎలా ఎక్కింది. అలా ఎక్కి ఏమాత్రం భయం లేకుండా గడ్డిని ఎలా మేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేకలు తరచుగా చెట్లు, కొండలను ఎక్కుతాయి. కానీ విద్యుత్ తీగలపై నిలబడిన ఆ మేక భయం లేకుండా ఎలా వుండగలుగుతోందని అడుగుతున్నారు. ఈ మేకను చూస్తూ వీధి జనం అవాక్కయ్యారు.