ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గురువారం విలేకరుల సమావేశంలో సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కథానాయికలను అడవుల రక్షకులుగా చిత్రీకరిస్తూ ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్‌లో పాల్గొనడం నేటి సినిమాలో హీరోయిజానికి కొత్త నిర్వచనంగా మారిందన్నారు. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని చెప్పారు. అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని చెప్పారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో సమావేశమై ఏడు అంశాలపై చర్చించారు.
చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుమ్కీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక హీరోయిజంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పుష్ప 2ను ఉద్దేశించినవే అవుతాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.