వివరాల్లోకి వెళితే.. పోలీసులకు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ భార్య జూలీ ఫిర్యాదు చేసింది. అయితే అతడు ఊటీలో వున్నాడని తెలుసుకున్నాక.. గంటల వ్యవధిలోనే ఈ కేసును ఉపసంహరించుకుంది. పవర్ స్టార్ ఊటీకి వెళ్లేందుకు కారణం అతనిపై కేసులుండటమేనని పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాసన్‌పై న్యూఢిల్లీతో పాటు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి.