ఆనందయ్య ఆయుర్వేద మందుపై పరిశోధనలో పురోగతి సాధించారు. టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి తుడా కార్యాలయం వేదికగా బుధవారం టీటీడీ ఆయుర్వేద నిపుణులు, ఆనందయ్య కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు.
జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ అనుమతులు కలిగిన ల్యాబరేటరీ చేర్లోపల్లి సమీపంలో సుజన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో అధ్యయనం అనుకూలతల తీరును పరిశీలించిన టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి, టీటీడీ ఆయుర్వేద వైద్య నిపుణులు.
ఆనందయ్య కరోనా మందుపై సానుకూల ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందుపై తిరుపతిలోని సృజన లైఫ్ రీసెర్చ్ సెంటర్లో అధ్యయనం సాగుతోంది. ప్రభుత్వ పరిశోధనా సంస్థల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల సానుకూల నివేదికలు వస్తే యుద్ద ప్రాతి పదికన ఈ మందు సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీటీడీ సిద్దంగా ఉందన్నారు.