350 కేజీల పేలుడు పదార్థాలతో దాడి... జైషే తీవ్రవాదులగా స్థానికులు?

గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి కోసం ఏకంగా 320 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పీస్ పీస్ అయిపోయింది. ఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనాన్ల సంఖ్య 28కు చేరింది. 
 
గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పుల్వామా జిల్లా అవంతిపురాలో ఈ దాడి జరిగింది. కొంతమంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన వాహనం శ్రీనగర్ వెళ్తుండగా కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. వెంటనే ఐఈడీ బాంబును పేల్చడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో తొలుత 18 మంది మరణించగా, మరో పది మంది  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ దాడికి పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. స్థానిక యువకులే ఉగ్రవాదులుగా మారిపోయి ఈ అత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పేలుడు కోసం ఉగ్రవాదులు స్కార్పియో వాహనంలో 350 కిలోల పేలుడు పదార్థాలు నింపుకున్నారు. 
 
కాన్వాయ్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఓ ఉగ్రవాది స్కార్పియోలో పేలుడు పదార్థాలతో దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. సీఆర్పీఎఫ్ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారం మేరకు ఈ భారీ పేలుడులో 28 మంది జవాన్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడితో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పరిశీలించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు